అలిపిరి మెట్ల మార్గంలో బూట్లతో నడిచిన వ్యక్తి

రిపోర్టర్: సురేష్ స్థలం: Tirupati

తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకునే అత్యంత పవిత్రమైన అలిపిరి మెట్ల మార్గంలో ఓ వ్యక్తి బూట్లు వేసుకొని నడవడం తీవ్ర కలకలం రేపింది. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ ఘటన జరగడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరించిన సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తిరుమల పవిత్రతను కాపాడటంలో భద్రతా సిబ్బంది వైఫల్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.