జాతిపితకు నివాళి: బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ తన్నీరు రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సదరు కార్యక్రమంలో పలువురు కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని బాపూజీ ఆశయాలను స్మరించుకున్నారు.