భారత్‌లో ఐక్లౌడ్ ప్లస్ యూజర్లకు యాపిల్ టీవీ ఉచితం
రిపోర్టర్: వెంకట్
స్థలం: భారతదేశం
భారత్‌లో సబ్స్క్రిప్షన్ సర్వీసులను యాపిల్ పునరుద్ధరిస్తోంది. ఐక్లౌడ్ ప్లస్ యూజర్లకు యాపిల్ టీవీ, యాపిల్ ఆర్కేడ్ సర్వీసులను ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. నెలకు రూ.75 ప్రారంభ ధరతో లభించే ఈ ప్లాన్ ద్వారా క్లౌడ్ స్టోరేజ్‌తో పాటు వీడియో స్ట్రీమింగ్, గేమింగ్ సేవలు ఒకే ప్యాకేజీలో అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త విధానం స్టాండర్డ్ యాపిల్ వన్ సబ్స్క్రిప్షన్లపై ప్రభావం చూపనుంది.