నల్లగొండ రైతుల పొలాలు ఎండుతుంటే నీళ్లు తరలిస్తారా అంటూ జగదీశ్‌రెడ్డి ఆగ్రహం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: సూర్యాపేట

నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నీటిని ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగానికి అందించకుండా ఖమ్మం జిల్లాకు తరలించడంపై మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం సింగారెడ్డిపాలెంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలతో, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంగీకరించి తూములు మూయించారని ఆరోపించారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు.