సాక్షి టీవీ రిపోర్టర్‌గా మునికృష్ణ నియామకం: యువ నేత శుభాకాంక్షలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: శ్రీరంగరాజపురం
శ్రీరంగరాజపురం మండల పరిధిలో సీనియర్ జర్నలిస్ట్ మునికృష్ణ సాక్షి టీవీ రిపోర్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకం పట్ల స్థానిక ప్రాంతంలో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఈ సందర్భంగా నూతన రిపోర్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మునికృష్ణను మండల యువ నాయకుడు పైనేని మురళి స్వయంగా అభినందించారు. ఆయన భవిష్యత్తులో మరింత సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.