'సభను తప్పుదోవ పట్టించారు': మంత్రి పొంగులేటిపై హరీశ్‌రావు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

రిపోర్టర్: గోపి స్థలం: Hyderabad

శాసనసభలో తనపై తప్పుడు ఆరోపణలు చేసి పవిత్రమైన సభను తప్పుదోవ పట్టించడంతో పాటు తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందజేశారు. గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో తన మామగారు భూకబ్జాకు పాల్పడ్డారంటూ మంత్రి చేసిన నిరాధార వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫిటిషన్ సమర్పించారు.