త్వరలోనే ఎన్డీఏ టూ రాత పరీక్ష ఫలితాలు విడుదల

రిపోర్టర్: విజయ్ స్థలం: న్యూఢిల్లీ

యూపీఎస్సీ నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నావల్ అకాడమీ పరీక్ష ఫలితాలు త్వరలో వెలువడనున్నాయి. సెప్టెంబర్ 13న దేశవ్యాప్తంగా జరిగిన ఈ రాత పరీక్ష ఫలితాలను సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ మొదటి వారంలో అధికారిక వెబ్సైట్ upsc.gov.in లో విడుదల చేయనున్నారు. అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నంబర్లతో కూడిన పీడీఎఫ్ జాబితాను అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది. ఫలితాల విడుదల తర్వాత తదుపరి దశ ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభం కానుంది.