ఖమ్మం బస్ డిపో వద్ద ఆర్టీసీ కూటమి ఎన్నికల ప్రచారం: ఉద్యోగుల మద్దతు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం బస్ డిపో ఎదుట సోమవారం తెల్లవారుజామున టీజీఎస్ఆర్టీసీ ఈయూ–టీఎంయూ కూటమి ఆధ్వర్యంలో ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ సమితి సభ్యులు భాగం హేమంత్ రావుతో పాటు పలువురు యూనియన్ నాయకులు పాల్గొని కూటమి అభ్యర్థుల విజయం కోసం ఉద్యోగులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో తమ పక్షాన నిలిచే నాయకులను గెలిపించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు.