ఈసీ నిర్ణయంపై రాహుల్ గాంధీ నిప్పులు: బీజేపీకి తొత్తుగా మారారంటూ తీవ్ర ఫైర్
రిపోర్టర్: రాజేష్
స్థలం: New Delhi
ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పేరుతో కోట్ల మంది ఓట్లను తొలగించారని, ఇది ముమ్మాటికీ అక్రమ ఎన్నికల ప్రక్రియేనని రాహుల్ గాంధీ ఆరోపించారు.