నర్సంపేట మున్సిపాలిటీలో డిజిటల్ కీ మొరాయింపుతో ప్రజలకు తప్పని తిప్పలు
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
నర్సంపేట మున్సిపాలిటీలో డిజిటల్ కీ పనిచేయక ధ్రువీకరణ పత్రాలు నిలిచాయి. కమిషనర్ లాగిన్లు పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ప్రజావాణిలో ప్రవీణ్ మాదాసి, కందికొండ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు స్పందించి సాంకేతిక లోపాన్ని వెంటనే సరిచేసి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.