హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రి పొంగులేటి

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం రాయదుర్గంలో మల్కంచెరువు వెనుక వైపు సుమారు 2.85 ఎకరాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ పనులకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు పత్రాలు అందజేశారు. రాష్ట్రంలోని పేదలందరికీ శాశ్వత గృహవసతి కల్పించే వరకు ఈ పథకం కొనసాగుతుందని, రాబోయే నెల రోజుల్లో ప్రతి నియోజకవర్గంలోనూ ఈ పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.