ఓట్ల చోరీ ఆరోపణలపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు సిద్ధమన్న అమిత్ షా

రిపోర్టర్: సురేష్ స్థలం: Lucknow

ఓట్ల చోరీ ఆరోపణలపై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించడానికి బీజేపీ సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. లక్నోలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్లో చర్చించే ధైర్యం లేక కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేవలం రోడ్లపై డ్రామాలు ఆడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిసారీ అంపైర్పై నెపం నెట్టడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు.