బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షల రిజిస్ట్రేషన్ షురూ

రిపోర్టర్: విజయ్ స్థలం: బీహార్

బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బీపీఎస్సీ టీఆర్ఈ నాలుగో విడత ఉపాధ్యాయ నియామకాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సెప్టెంబర్ 21 నుండి ప్రారంభించనుంది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ వెల్లడించింది. ఈ నియామక డ్రైవ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాల స్థాయిలలో మొత్తం 32,388 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రాథమిక పాఠశాలల నుండి సీనియర్ సెకండరీ తరగతుల వరకు వేర్వేరు విభాగాల్లో ఈ పోస్టులను కేటాయించారు.