హర్యానాలో జమ్ము కశ్మీర్ బస్సుపై దాడి: కలకలం రేపిన ఉదంతం

రిపోర్టర్: హరి స్థలం: Karnal

హర్యానాలోని కర్నాల్ జిల్లాలో జమ్ము కశ్మీర్ నుంచి వస్తున్న బస్సుపై దుండగులు దాడి చేశారని డ్రైవర్ తెలిపారు. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న బస్సు నీలోఖేరి వద్ద ఆగగా, కొందరు వ్యక్తులు వాహనాన్ని ధ్వంసం చేసి తనపై దాడి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ హర్యానా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది.