భారీ వర్షం కారణంగా భారత్ న్యూజిలాండ్ తొలి వన్డేలో ఆలస్యం

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

న్యూజిలాండ్ తో ప్రారంభం కానున్న తొలి వన్డే మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారిందని క్రీడా వర్గాలు తెలిపాయి. మైదానంలో పిచ్ పై కవర్లు కప్పి ఉంచడం వల్ల టాస్ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నాయి. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతుండగా, యువ పేస్ బౌలర్లతో కూడిన భారత జట్టు ఈ సిరీస్ లో తలపడుతోందని వివరించాయి.