అమెరికాలో రాజకీయ కలకలం: డెమొక్రాట్ నేతపై జేడీ వాన్స్ నిప్పులు
రిపోర్టర్: విజయ్
స్థలం: Ohio
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఓహియో ఎన్నికల ప్రచారంలో డెమొక్రాట్ అభ్యర్థి ఆమీ ఆక్టన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమెను అస్థిరమైన వ్యక్తిగా అభివర్షిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. కోవిడ్ సమయంలో చర్చిలు, పాఠశాలలు మూసివేయించారని ఆయన ఆరోపించారు. రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామికి మద్దతుగా నవంబర్ మూడున జరిగే మధ్యంతర ఎన్నికల్ లో ఘనవిజయం అందించాలని ఓటర్లను వాన్స్ కోరారు.