మొసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు భారత మహిళా క్రికెటర్ల నిరాకరణ

రిపోర్టర్: వెంకట్ స్థలం: World

మహిళల ఆసియా కప్ గెలిచిన భారత జట్టు పాకిస్థాన్ మంత్రి, ఏసీసీ చీఫ్ మొసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి నుంచి ట్రోఫీ అందుకోలేమని బీసీసీఐ స్పష్టం చేసింది. గతంలో పురుషుల జట్టు తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఈ గౌరవప్రదమైన నిరసన తెలిపినట్లు బోర్డు వెల్లడించింది.