యమునా నదిపై కాంక్రీట్ గోడ నిర్మాణం: తీవ్ర ముప్పు తప్పదన్న నిపుణులు
రిపోర్టర్: హరి
స్థలం: ఢిల్లీ
ఢిల్లీలో యమునా నది వెంబడి నాలుగు కిలోమీటర్లకు పైగా రివర్స్ కాంక్రీట్ గోడ నిర్మాణ ప్రణాళికపై నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పర్యావరణ వేత్త దివాన్ సింగ్ వెల్లడించారు. ఈ నిర్ణయం నది సహజ ప్రవాహాన్ని అడ్డుకోవడంతో పాటు ఇతర ప్రాంతాలకు వరద ముప్పును మరింత పెంచుతుందని, వరద నిర్వహణ లోపాలను సరిదిద్దకుండా ఇటువంటి చర్యలు చేపడితే భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.