ప్రాంతీయ పార్టీలే ప్రజల ఆకాంక్షలకు అత్యంత దగ్గరగా ఉంటాయి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ / న్యూఢిల్లీ

రాష్ట్ర స్థాయిలో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించడంలో ప్రాంతీయ పార్టీల పాత్ర ఎంతో కీలకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో పదేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధిని వివరించారు. కేంద్రంలోని పాలక పార్టీల వైఖరిని, దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యతను ఈ సందర్భంగా ఆయన బలంగా నొక్కిచెప్పారు.