స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అమరావతిలో జరిగిన తెదేపా లీడర్షిప్ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ.. తన పూర్తి ధ్యాస 2029 ఎన్నికల గెలుపుపైనే ఉందన్నారు. చిన్న సమస్యల పరిష్కారానికి ప్రతి నియోజకవర్గానికి కోటి రూపాయల చొప్పున నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. వైకాపా దుష్ప్రచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలని స్పష్టం చేశారు.