అమెరికాలో బయటపడ్డ నలభై ఐదు మిలియన్ల ఏళ్ల నాటి శిలాజాలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Oceanside

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఓషన్ సైడ్ నగరంలో జరుగుతున్న మౌలిక వసతుల నిర్మాణ పనుల్లో అరుదైన శిలాజాలు బయటపడ్డాయని సిటీ అధికారులు వెల్లడించారు. భూమికి పన్నెడుగుల లోతున తవ్వకాలు జరుపుతుండగా సుమారు నలభై ఐదు మిలియన్ల ఏళ్ల కిందటి భారీ క్షీరదానికి చెందిన ఎముకల అవశేషాలు లభించినట్లు పురావస్తు శాస్త్రవేత్త జోసెఫ్ ఎల్ అడ్లి పేర్కొన్నారు. ఇవి థండర్ బీస్ట్ లేదా స్వాంప్ రైనో జాతికి చెందిన ప్రాణికి సంబంధించినవి అయి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.