జనసేనలోకి ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు
రిపోర్టర్: నరేష్
స్థలం: Kakinada
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మాజీ శాసనసభ్యులు వరుపుల సుబ్బారావు జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల నుంచి వైఎస్సార్‌సీపీ నేతలు భారీగా జనసేన పార్టీలో చేరినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.