భవానీపురంలో మహా గణపతిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విజయవాడ

విజయవాడ భవానీపురంలో డూండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పర్యావరణహితంగా రూపొందించిన 72 అడుగుల శ్రీ పంచముఖ వరసిద్ధి మహా గణపతిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు మంత్రికి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, టీడీపీ ఇంచార్జ్ బుద్దా వెంకన్న, జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ పాల్గొన్నారు.