పాఠశాలల అభివృద్ధికి బాటలు వేస్తున్న ఎస్ఎంసీ ఎన్నికలు
రిపోర్టర్: G TAMMUNAIDU
స్థలం: రోలుగుంట
పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలకు నగరా మోగింది. ప్రస్తుత ఎస్ఎంసీల గడువు ముగియడంతో నూతన కమిటీల ఏర్పాటుకు ఈనెల 29న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికలు జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో శుక్రవారం రోలుగుంట మండలంలో అన్ని పాఠశాలల్లో ఓటర్ల జాబితాలను ప్రదర్శించారు. 25వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఈ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం ఉంటుందని, అదేరోజు తుది ఓటర్ల జాబితా ఖరారు చేసి ప్రదర్శిస్తారని ఎంఈఓ జాన్ ప్రసాద్ తెలిపారు.