బెల్లంపల్లి ప్రభుత్వ కళాశాలలో పీజీ సీట్లకు నేటి నుంచి వెబ్ ఆప్షన్లు
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి ప్రభుత్వ పీజీ కళాశాలలో ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంకాం కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 8 నుంచి 10 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. సీపీగెట్-2026 ఉత్తీర్ణులతో పాటు ఉత్తీర్ణులు కాని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ నెల 14న సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొంటూ, ఆసక్తి గల అభ్యర్థులు మరింత సమాచారం కోసం 9959269975 నంబరును సంప్రదించాలని కోరారు.