జైళ్ల శాఖ డీఐజీలుగా ఎస్.రాహుల్, కె.రాజేశ్వరరావులకు పదోన్నతులు
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
రాజమహేంద్రవరం, కడప జైళ్ల సూపరింటెండెంట్లుగా పనిచేస్తున్న ఎస్.రాహుల్, కె.రాజేశ్వరరావులకు రాష్ట్ర ప్రభుత్వం డీఐజీలుగా పదోన్నతి కల్పించింది. రాహుల్‌ను గుంటూరు రేంజ్ డీఐజీగా, రాజేశ్వరరావును కడప రేంజ్ డీఐజీగా నియమించింది. ఖాళీ అయిన సూపరింటెండెంట్ పోస్టులకు ఇతర అధికారులకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.