'మధ్యప్రదేశ్ పర్యటన': సెప్టెంబర్ 17న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ షెడ్యూల్
రిపోర్టర్: రాము
స్థలం: మధ్యప్రదేశ్
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ సెప్టెంబర్ 17, 2026 న మధ్యప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇండోర్ లోని దేవి అహల్యాబ హోల్కర్ ఎయిర్ పోర్ట్ లో ఆయనకు ఘన స్వాగతం లభించనుంది. అనంతరం గాంధీ నగర్ మైదానంలో యోజన కింద కొత్త రాష్ట్రవ్యాప్త నమోదు ప్రక్రియను ఆయన ప్రారంభించనున్నారు. అలాగే ఉజ్జయినిలోని రామ ఘాట్ వద్ద మోక్షదాయిని మా శిప్రా హారతిలో పాల్గొనడంతో పాటు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సేవా, అంకితభావానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించే సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా 'ఆశీర్వాద్ కా దీయా' వెలిగించనున్నారు. రాత్రి రామ ఘాట్ లో జరిగే భజన సంధ్య కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు.