'సేవా సంకల్ప అభియాన్': దేశవ్యాప్తంగా ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

రిపోర్టర్: గోపి స్థలం: న్యూఢిల్లీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17న దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో ‘సేవా సంకల్ప అభియాన్’ను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరుగుతుండగా, ఢిల్లీలోని ‘కర్తవ్య మార్గం’ వద్ద సుమారు 1.25 లక్షల ఆశీర్వాద దీపాలను వెలిగించి ప్రజలు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 2001 నుండి గుజరాత్ సీఎంగా, 2014 నుండి దేశ ప్రధానిగా ఆయన అసాధారణ మైలురాళ్లను సాధించారు.