మహిళలంటే చిన్నచూపు ఎందుకంటూ వైఎస్ జగన్‌పై క్రీడాకారిణి ఫైర్

రిపోర్టర్: రాజేష్ స్థలం: Andhra Pradesh

ఏపీ తరపున నేషనల్స్ ఆడి గోల్డ్ మెడల్ సాధించిన తనను ఫేక్ అంటున్నారంటూ వైఎస్ జగన్‌పై మహిళా జిమ్నాస్టిక్ క్రీడాకారిణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలంటే అంత చిన్నచూపు ఎందుకని ఆమె నిలదీశారు. తాను 2022లో వరల్డ్ కప్ ఆడానని గుర్తుచేస్తూ, ఇలాంటి వారిని ఏమనాలని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.