ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన నగర సీపీ సజ్జనర్
రిపోర్టర్: మహేష్
స్థలం: Hyderabad
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ మరియు ఖైరతాబాద్ ప్రాంతాల్లో వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను నగర సీపీ వీసీ సజ్జనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ చేపట్టిన బందోబస్తు, భద్రతా చర్యలను ఆయన సమీక్షించారు. శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరఫున అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారులు వెల్లడించారు.