చెట్టు కింద వృద్ధురాలి దీనస్థితిపై స్పందించిన అదనపు కలెక్టర్ మధుసూదన్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Mahabubnagar

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లిలో చెట్టు కింద ఆరుబయట జీవిస్తున్న 63 ఏళ్ల కురువ అనంతమ్మ దయనీయ పరిస్థితిపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తక్షణమే స్పందించారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా స్వయంగా ఘటనా స్థలానికి వెళ్లిన ఆయన, వృద్ధురాలిని కలిసి ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులను ఆరా తీశారు. ఆమెకు సురక్షిత ఆశ్రయం కల్పించడంతో పాటు కుటుంబ సభ్యుల నుంచి బాధ్యత వహించేలా నోటరీ హామీ పత్రం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.