బెంగళూరు నుంచి లక్నో వెళ్లే విమానంలో హైజాక్ బెదిరింపు కలకలం

రిపోర్టర్: హరి స్థలం: Bengaluru

బెంగళూరు నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో విమానంలో హైజాక్ బెదిరింపు లేఖ కలకలం సృష్టించిందని సీనియర్ పోలీసులు తెలిపారు. విమానం మరుగుదొడ్డిలో విమానం అపహరణకు గురికానుందంటూ రాసి ఉన్న కాగితం లభించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్ కి మళ్లించి బెంగళూరులోని కెపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపారు. భద్రతా బలగాలు సుదీర్ఘంగా తనిఖీలు నిర్వహించి ఇది నకిలీ బెదిరింపుగా తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.