విద్యార్థులకు అలర్ట్: నవంబర్ ఆరున క్యాట్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు

రిపోర్టర్: సతీష్ స్థలం: తెలంగాణ

దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్యాట్ రెండు వేల ఇరవై ఆరు పరీక్ష హాల్ టికెట్ల విడుదల తేదీ మారినట్లు నిర్వహణ అధికారులు వెల్లడించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ నాల్గవ తేదీన రావాల్సిన అడ్మిట్ కార్డులు వాయిదా పడ్డాయి. సవరించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ ఆరు నుండి అధికారిక వెబ్ సైట్ ద్వారా విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని పరీక్ష నిర్వహణ వర్గాలు స్పష్టం చేశాయి.