చెర్లోపల్లి వెంకయ్య స్వామి సన్నిధిలో భక్తి పారవశ్యం
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన ఉన్న భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు శ్రీనివాసులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం నిర్వహించిన భారీ అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకతో ఆలయ ప్రాంగణం భక్తుల నామస్మరణతో మార్మోగింది.