ఫీజు బకాయిల పేరుతో సర్టిఫికెట్లు ఆపొద్దన్న తెలంగాణ హైకోర్టు

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

ఫీజు బకాయిలు ఉన్నాయనే కారణంతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేయడంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ నల్లకుంటలోని జాహ్నవి డిగ్రీ కాలేజీ ఇద్దరు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను వెంటనే తిరిగి ఇవ్వాలని జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ఆదేశించారు. ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులైన విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను కాలేజీలు ఎట్టిపరిస్థితుల్లోనూ నిలిపివేయకూడదని ఉన్నత విద్యామండలి పేర్కొంది.