పెండింగ్ కేసుల పరిష్కారమే పోలీసుల ప్రధాన కర్తవ్యం

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను డీసీపీ ఎ.భాస్కర్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతిని పరిశీలించారు. సీసీటీఎన్ఎస్లో కేసుల వివరాలు సకాలంలో నమోదు చేయాలని, ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించి సమస్యలు త్వరగా పరిష్కరించాలని సీఐ శ్రీనివాసరావును ఆదేశించారు.