సరస్వతి విద్యా నికేతన్ పాఠశాలలకు ఆరు కీలక మార్గదర్శకాలు జారీ

రిపోర్టర్: నరేష్ స్థలం: తెలంగాణ

రాష్ట్రంలోని సరస్వతి విద్యా నికేతన్ మోడల్ పాఠశాలల నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ కీలకమైన ఆరు మార్గదర్శకాలను జారీ చేసిందని అధికారులు తెలిపారు. పాఠశాలల్లో 75 శాతం హాజరు తప్పనిసరి చేయడంతో పాటు, తరగతి గదులను పరీక్షా కేంద్రాలుగా వాడవద్దని ఆదేశించారు. అలాగే పోలీసుల వసతికి అనుమతించరాదని, సిబ్బంది కొరతను డిప్యుటేషన్ ద్వారా భర్తీ చేయాలని స్పష్టం చేశారు.