ఆత్మరక్షణ కోసం విద్యార్థులకు కరాటే శిక్షణ అత్యంత అవసరమన్న నాతరి స్వామి

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం త్రినేత్రి ఫంక్షన్ హాల్లో 6వ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు ఘనంగా నిర్వహించారు. కుందేళ్ళ రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సింగరేణి జీఎం రాధాకృష్ణ, కాంగ్రెస్ నాయకులు నాతరి స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మరక్షణ కోసం విద్యార్థులకు కరాటే శిక్షణ ఎంతో అవసరమని, చదువుతో పాటు క్రీడలు కూడా ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడతాయని పేర్కొన్నారు.