రాప్తాడు ఉన్మాది హేమంత్ ఆరోగ్యం నిలకడ: కాలు తొలగించే ప్రమాదం ఉందన్న డాక్టర్లు

రిపోర్టర్: హరి స్థలం: శ్రీ సత్యసాయి జిల్లా

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాప్తాడు నిందితుడు హేమంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి తెలిపారు. అయితే అతడి కుడికాలుకు రక్త ప్రసరణ తగ్గిందని, ఇదే పరిస్థితి కొనసాగితే కాలు తొలగించాల్సి రావచ్చని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్స్రే పరీక్షల్ లో కాళ్లలో బుల్లెట్లు కనిపించలేదని స్పష్టం చేసిన వైద్యులు, త్వరలోనే శస్త్రచికిత్స నిర్వహించి తదుపరి చికిత్సపై స్పష్టత ఇస్తామని వెల్లడించారు.