ఇసుక అక్రమ తవ్వకాలపై సర్కార్ కొరడా: బాధ్యులైన అధికారులపై వేటుకు ఆదేశం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Bapatla
ఇసుక అక్రమ తవ్వకాలు, ఖనిజాల అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని అధికారులు వెల్లడించారు. బాపట్ల జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఇకపై ఫిర్యాదులు రాకపోయినా సమాచారం అందిన మూడు రోజుల్లోనే తనిఖీలు నిర్వహిస్తామని, అక్రమాలు జరిగితే సంబంధిత శాఖ అధికారులదే పూర్తి బాధ్యతని హెచ్చరించారు. తనిఖీల్ లో మైనింగ్ నిర్ధారణ అయితే భారీ జరిమానాలతో పాటు వాహనాల సీజింగ్, కఠినమైన ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.