జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం: ఖమ్మంలో టీడబ్ల్యూజేఎఫ్ నేతల స్పష్టీకరణ
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతున్న ఏకైక యూనియన్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అని ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నానబాల రామకృష్ణ, అర్వపల్లి నగేష్ స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య నాయకత్వంలో అక్రిడిటేషన్, హెల్త్ కార్డులు, కేబుల్ టీవీ కార్డుల కోసం ఐ అండ్ పీఆర్ ముట్టడితో పాటు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఉద్యమాలు చేశామన్నారు. ఇండ్ల స్థలాలు, బస్ పాస్ హక్కులు సాధించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.