విజయవాడలో మున్సిపల్ పోలింగ్ కలకలం: బ్యాలెట్ పేపర్లలో తారుమారైన గుర్తులు
రిపోర్టర్: సురేష్
స్థలం: Vijayawada
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ఓల్డ్ రాజరాజేశ్వరి పేట యాభై ఐదో డివిజన్ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో తీవ్ర పొరపాటు వెలుగు చూసింది. బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడంతో అధికారులు అవాక్కయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరుకు ఎదురుగా కాంగ్రెస్ గుర్తు, కాంగ్రెస్ అభ్యర్థి పేరు పక్కన ఫ్యాన్ గుర్తు ముద్రించారు. ఈ ఘోర తప్పిదంపై అభ్యర్థులు అభ్యంతరం తెలపడంతో పోలింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశామని రిటర్నింగ్ అధికారి చక్రవర్తి తెలిపారు.