టెంపుల్ హెల్త్ వేరబుల్ పరికరాన్ని పరీక్షించి ఆశ్చర్యపోయిన క్రికెటర్ శుభ్మన్ గిల్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ఆక్లాండ్
భారత టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్కు ముందు వినూత్న టెంపుల్ హెల్త్ వేరబుల్ పరికరాన్ని పరీక్షించినట్లు నివేదికలు వెల్లడించాయి. జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ రూపొందించిన ఈ ప్రత్యేక డివైజ్ను ప్రాక్టీస్ సమయంలో గిల్ ధరించారు. మెదడు రక్తప్రసరణ మార్పులను ట్రాక్ చేసే ఈ అత్యాధునిక పరికరం పనితీరు పట్ల గిల్ ఎంతో ఇంప్రెస్ అయ్యారని, త్వరలోనే దీని ప్రీ ఆర్డర్లు ప్రారంభంకానున్నాయని నిపుణులు తెలిపారు.