భాను ప్రతాప్ సింగ్‌పై భార్య సంచలన ఆరోపణలు.

రిపోర్టర్: శివ స్థలం: బీహార్

బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి, ఖగారియా ఎస్పీ భాను ప్రతాప్ సింగ్‌పై ఆయన భార్య పూజా కుమారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఐపీఎస్ అయిన తర్వాత తన భర్త తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని, విడాకులు కోరుతున్నాడని ఆరోపించారు. తన ఆరేళ్ల కుమార్తెను చూడకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు.