యువతకు ఎస్పీ దామోదర్ హెచ్చరిక: డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలని స్పష్టీకరణ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: విజయనగరం
యువత, విద్యార్థులు రహదారి భద్రతతో పాటు మహిళలు, బాలల రక్షణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ స్పష్టం చేశారు. పూసపాటిరేగలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో త్రిశూల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ మరియు గంజాయికి అలవాటు పడి యువత తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.