ఒంగోలులో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి

రిపోర్టర్: రమేష్ స్థలం: Ongole, Prakasam District

ప్రకాశం జిల్లా ఒంగోలులో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రహస్య సమాచారంతో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.1,01,070 నగదు, ఆరు సెల్‌ఫోన్లు మరియు ఒక మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.