వీధిదీపాల ప్రాజెక్టును భ్రష్టు పట్టించిన వైకాపా: కూటమి సర్కార్ తో మళ్లీ పట్టాలెక్కిన వైనం
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
వైకాపా హయాంలో ఎల్ఈడీ వీధిదీపాల ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యమైందని, నిర్వహణ గాలికొదిలేసి అంధకారంలోకి నెట్టారని అధికారులు తెలిపారు. గత తెదేపా ప్రభుత్వంలో విజయవంతంగా నడిచిన ఈ ప్రాజెక్టుకు ఈఈఎస్ఎల్ సంస్థ బకాయిలు చెల్లించకుండా ఇబ్బంది పెట్టారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టుకు మళ్లీ జీవం పోసి, కొత్తగా పది లక్షలకు పైగా ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.