అమెరికాలో హైదరాబాద్‌ టెకీ హఠాన్మరణం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ జాబెర్‌ హుస్సేన్‌ నిద్రలోనే హఠాన్మరణం చెందారు. ఐదేళ్ల క్రితం చదువు నిమిత్తం మసాచుసెట్స్‌ వెళ్లిన ఆయనకు ఇటీవలే వివాహమైంది. కుటుంబంతో మాట్లాడిన కొద్దిసేపటికే ఈ విషాద వార్త అందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆర్థికంగా వెనకబడిన కుటుంబానికి చెందిన జాబెర్‌ మృతదేహాన్ని భారత్‌కు రప్పించాలని ఎంబీటీ నేత అమ్జద్‌ ఉల్లా ఖాన్‌ విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కోరారు.