గురువు చేతుల మీదుగా ఘన సన్మానం అందుకుని భావోద్వేగానికి లోనైన చిన నరసయ్య
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో సీనియర్ జర్నలిస్ట్, కవి కట్టెకోల చిన నరసయ్యను ఆయన చిన్ననాటి గురువు శేషయ్య సారు సన్మానించారు. గురువు చేతుల మీదుగా సత్కారం అందుకున్న నరసయ్య భావోద్వేగంతో పాదాభివందనం చేశారు. తన గురువే సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. పూర్వ విద్యార్థుల ఈ ఆత్మీయ సమ్మేళన వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొని అభినందించారు.