'ఆశీర్వాద్ నూ దివ్డో': మోదీ పుట్టినరోజు వేడుకలు
రిపోర్టర్: సతీష్
స్థలం: గుజరాత్
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని గుజరాత్‌లో భారీ ఏర్పాట్లు చేశారు. గురువారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 18,500 ప్రాంతాల్లో ఒకేసారి 88 లక్షల ప్రమిదలను వెలిగించేందుకు అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు. ‘ఆశీర్వాద్ నూ దివ్డో’ పేరుతో ఈ వేడుకను నిర్వహిస్తుండగా, అహ్మదాబాద్‌లోని కంకరియా లేక్‌ఫ్రంట్ వద్ద 1.25 లక్షలు, అటల్ బ్రిడ్జ్ వద్ద 76 వేల దీపాలను వెలిగించనున్నారు. మరోవైపు వారణాసిలో జరిగే సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు.